హాట్‌ అండ్‌ స్పైసీ 'ఆరెంజ్‌' బ్యూటీ

మరిన్ని వార్తలు

'మనసుకు నచ్చింది' సినిమాతో క్యూట్‌గా తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ అమైరా దస్తూర్‌. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన రిజల్ట్‌ ఇవ్వలేదు. తర్వాత రాజ్‌తరుణ్‌తో 'రాజుగాడు' చిత్రంలో కనిపించి, తన హాట్‌ హాట్‌ అందాలతో కుర్రకారుకు ఎర వేసింది. అమ్మడి హాట్‌ అండ్‌ క్యూట్‌ అందాలు కుర్రోళ్లను బాగానే మాయ చేశాయి. కానీ సినిమా రిజల్ట్‌ ముందు ఆమె అందాలు చిన్నబోయాయి. దాంతో తెలుగులో అమ్మడికి పెద్దగా అవకాశాలు దక్కలేదు తర్వాత. దాంతో బాలీవుడ్‌లో ట్రై చేసింది. ప్రస్తుతం అక్కడ రెండు సినిమాల్లో నటిస్తోంది. 'రాజ్మా చావెల్‌', 'మెంటల్‌ హై క్యా' చిత్రాల్లో అమైరా దస్తూర్‌ నటిస్తోంది. దీంతో పాటు తమిళంలోనూ ఓ సినిమాలో నటిస్తోంది. తమిళ ప్రముఖ కమెడియన్‌ సంతానం ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. గతంలో ధనుష్‌ సరసన 'అనేక్‌' చిత్రంలో నటించి తమిళ తంబీల మనసుల్ని అప్పుడే కొల్లగొట్టేసింది అందాల అమైరా దస్తూర్‌. సినిమాల సంగతి అటుంచితే, సోషల్‌ మీడియాలో గ్లామర్‌ పిక్స్‌ పోస్ట్‌ చేయడంలో ముందుంటుంది అమైరా. అందులో భాగంగానే తాజాగా ఈ పిక్‌ పోస్ట్‌ చేసింది. ఆరెంజ్‌ అండ్‌ ఆరెంజ్‌ కాస్ట్యూమ్‌లో అమ్మడి హాట్‌ అప్పీల్‌కి చూపు తిప్పుకోలేకపోతున్నారు నెటిజన్లు. ఆరెంజ్‌ లెదర్‌ బోటమ్‌, లైట్‌ ఆరెంజ్‌ కలర్‌ టాప్‌లో సింప్లీ సూపర్బ్‌గా ఉంది అమైరా.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS