నింగికెగిరిన అందమా నిన్నందుకో తరమా.!

By iQlikMovies - July 06, 2018 - 18:12 PM IST

మరిన్ని వార్తలు

అందాల భామ అమైరా దస్తూర్‌ ఆకాశాన్నందుకోవాలనుకుంటోందట. భలే అందంగా ఉంది కదా. అంతే మరి అందాల భామలు ఏం చెప్పినా అంతే. చూశారుగా ఈ పోజు అందుకే. ఆకాశాన్ని అందుకోవాలనే ఉత్సాహంతోనే ఈ ముద్దుగుమ్మ ఇచ్చిన పోజుకు కుర్రోళ్ల హృదయాలు కూడా ఆకాశం అంత ఎత్తు వరకూ ఎగిరి గంతేసేస్తున్నాయి. ఆకాశాన్ని అందుకోవాలనే ఉత్సాహంతో ఈ ముద్దుగుమ్మ ఉంటే, ఆమె అందాలను ఆస్వాదించే పనిలో కుర్రకారు బిజీ అయిపోయారు. అన్నీ ఉన్నా, ఈ ముద్దుగుమ్మకి పాపం అవకాశాలే దరికి చేరనంటున్నాయి. ఏదో అరకొరా సినిమాలతోనూ, వాణిజ్య ప్రకటనలతోనూ సరిపెట్టుకుంటోంది. యూత్‌లో ఈ బ్యూటీకి సూపర్‌ క్రేజ్‌ ఉన్నా, దర్శక నిర్మాతల దృష్టిలో ఎందుకు పడడం లేదో తెలీడం లేదు. ఇటీవల 'రాజాగాడు' చిత్రంలో పొట్టి పొట్టి డ్రస్సులతో చిట్టి పొట్టి స్టెప్పులేసి కుర్రోళ్ల గుండెల్ని మరింత పిండేసిన ఈ ముద్దుగుమ్మకి అసలు సిసలు ఛాన్స్‌ ఇస్తే నటిగా తానేంటో ప్రూవ్‌ చేసుకోవాలనుకుంటోంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS