అమైరా, అందాల రాక్షసిలా!

By iQlikMovies - May 16, 2019 - 09:00 AM IST

మరిన్ని వార్తలు

అందాల భామ అమైరా దస్తూర్‌కి సినిమాల్లో అవకాశాల కన్నా, సోషల్‌ మీడియాలో హాట్‌ ఫోటో షూట్సే ఎక్కువ. ఎప్పటికప్పుడే ఇక్కడ హాట్‌ హాట్‌ అప్‌డేట్స్‌ ఇస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా అప్‌లోడ్‌ చేసిన ఈ ఫోటోకి నెటిజన్స్‌ నుండి వస్తున్న రెస్పాన్స్‌ అంతా ఇంతా కాదు. పచ్చటి నేలపై, తెల్లని వెచ్చటి దుప్పటి పరుచుకున్న ఈ ఘాటు అందం ఎవరికోసమో.. అంటూ తమకు తోచిన రీతిలో కవితలల్లేస్తున్నారు కుర్ర జనం.

 

అవును ప్రియుని కోసం ఎదురు చూస్తున్న ప్రియురాలిలా ఆదమరిచిన అందాలను ఆవగా ఆరేస్తూ, ఉచితంగా అందాల విందు కావించేస్తోంది. ఉల్లిపొరలాంటి ఆ దుస్తుల్లో దాగీ దాగలేక అందాలు పెళ్లుబికి వస్తుంటే, మాటలతో సరిపెట్టుకుంటారా.? ఛాన్సే లేదు. ఇంకస్సలు ఆలస్యం చేయకుండా, ఈ అందాలపై ఓ కొంటె చూపు విసరాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS