పుష్ఫ‌క విమానాన్ని.. మ‌ళ్లీ వాడేశారు

By iQlikMovies - March 01, 2021 - 15:45 PM IST

మరిన్ని వార్తలు

పుష్ష‌క విమానం.. ఈ సినిమాని ఇష్ట‌ప‌డ‌ని సినీ ప్రేమికుడు ఉండ‌డు. ఎలాంటి డైలాగులూ లేకుండా.. తీసిన సినిమా ఇది. తెలుగులో టాకీ రోజుల్లోనూ, మూకీలో వ‌చ్చిన సినిమా. సింగీతం - క‌మ‌ల్ ల అద్భుత‌మైన ప్ర‌య‌త్నం. ఇప్పుడు మ‌ళ్లీ ఈ పుష్ష‌క విమానంని గుర్తు చేస్తున్నాడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌.

 

ఆనంద్ క‌థానాయ‌కుడిగా, దామోద‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సునీల్ కీల‌క పాత్ర‌ధారి. ఈచిత్రానికి `పుష్ష‌క విమానం` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌ల చేశారు. విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అయితే.. పాత పుష్ష‌క విమానానికీ, దీనికీ ఎలాంటి పోలిక‌లు, సంబంధాలు లేవు. ఇది మూకీ సినిమా కానే కాదు. మ‌రి ఆ పేరు ఎందుకు పెట్టారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. గ‌తంలో సూప‌ర్ హిట్ సినిమాల టైటిళ్ల‌ని వాడుకున్నా ఆ సినిమాలేవీ పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేక‌పోయాయి. మ‌రి ఈ పుష్ష‌క విమానం ఏం చేస్తుందో?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS