చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద హిట్ కొట్టిన చిత్రంగా ఆనందో బ్రహ్మ చిత్రం నిలిచిపోయింది. మౌత్ టాక్ తో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రోజురోజుకి కలెక్షన్స్ పరంగా కలెక్షన్స్ పెంచుకుంటూ నిర్మాతలకి లాభాల పంట పండిస్తున్నది.
ఇక ఈ చిత్రానికి సంబందించిన శాటీలైట్ రైట్స్ ని ఒక ప్రముఖ ఛానల్ సుమారు రూ3కోట్లకి కొనుగోలు చేసింది అన్న టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది. ఈ చిత్రానికి పెట్టిన మొత్తం బడ్జెట్ రూ 2.90 కోట్లు అవ్వగా ఇప్పుడు శాటీలైట్ ధర అంతకి ఎక్కువగా పలకడం ఒక రికార్డుగా చెబుతున్నారు.
మొత్తానికి ఈ చిత్రం ఇటు బాక్స్ ఆఫీస్ నే గాక అటు శాటీలైతే రికార్డ్స్ పరంగా కూడా పెను సంచలనం సృష్టించింది అనే చెప్పాలి.