గ్లామ్‌షాట్‌: సూయ, సూయ.. అందుకే నువ్వంటే అ(న)సూయ.

మరిన్ని వార్తలు

ఎంత మంది హాటెస్ట్‌ యాంకర్లు ఉన్నా వారందరిలో అనసూయ హాటనెస్సే వేరు. ఎన్ని విమర్శలొచ్చినా, ఆ విమర్శల్ని కూడా ప్రశంసలుగా మార్చేసుకునే కెపాసిటీ ఉన్న ముద్దుగుమ్మ అనసూయ. యాజ్‌ బార్‌ అయినా ఏమాత్రం వన్నె తగ్గని సొగసులు ఆమె సొంతం. ఎన్ని సార్లు చెప్పినా ఈ మాట అతిశయోక్తి కాదేమో. తాజాగా సోషల్‌ మీడియాలో అనసూయ పోస్ట్‌ చేసిన ఓ పిక్‌ చూస్తే, కామయ్యకు కబురెట్టాల్సిందే.. కౌగిలింతల వేళయ్యిందనీ.. అంటూ కవితలల్లాల్సిందే. ఆ రేంజ్‌లో ఉంది ఈ ఫోటోలో అనసూయ పోజు.

 

దివి నుండి దిగొచ్చిన దేవతలా కనిపిస్తోంది. ఫోటో టెక్నిక్‌నో, కెమెరామెన్‌ పనితనమో తెలీదు కానీ, చూపు తిప్పుకోనీయకుండా చేస్తోంది అనసూయ ఈ పోజులో. అందుకే అనసూయ అంటే అంత అసూయ మరి. పిట పిటలాడే వయసులో పుష్కలమైన గ్లామర్‌ ఉన్న వాళ్లు కూడా అనసూయ ముందు తట్టుకోలేకపోయారు. అంతటి అందం అనసూయది. అంతటి అందం ఒక్కసారిగా వచ్చి దహించేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. బ్లాక్‌ బ్యాక్‌ గ్రౌండ్‌కి కరెక్ట్‌ లైటింగ్‌ సెట్టయ్యి కొత్త బ్రైట్‌నెస్‌ తీసుకొచ్చింది. ఆ కాంబినేషన్‌కి సెట్టయ్యేలా బ్లూ కలర్‌ శారీ ఇంద్రలోకపు రాణిలా ఆ వయ్యారమైన పోజు, అనసూయ అందాన్ని నెక్స్‌ట్‌ లెవల్‌కి తీసుకెళ్లాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS