అరెరె.. అనసూయ ఆశలు ఆడియాశలయ్యేనా.?

మరిన్ని వార్తలు

మెగాస్టార్‌ 152 చిత్రంలో రంగమ్మత్త అనసూయకి ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ దక్కిందనే వార్తలు వినిపించాయి. లేటెస్ట్‌గా ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ అయిన సంగతి తెలిసిందే. షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యాక పరిణామాలు మారిపోయాయట. సినిమా నుండి అనసూయని తప్పించేశారంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. అనసూయ అవకాశాన్ని మరో స్టార్‌ హీరోయిన్‌కి ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్‌ ఎవరా.? అని ఆరా తీస్తే, ఈ మధ్యనే ఫుల్‌ ఛార్జ్‌ తీసుకున్న లేడీ సూపర్‌ స్టార్‌ విజయ శాంతి అని తెలుస్తోంది. అవునట.. అనసూయ ప్లేస్‌ లేడీ సూపర్‌ స్టార్‌ విజయ శాంతి కొట్టేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

ఈ మధ్య 'సరిలేరు..' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేదికపై చిరంజీవి, విజయశాంతిని చూసి, అభిమానుల కడుపు నిండిపోయింది. కన్నుల పండగలా అనిపించింది. అలా వారిద్దరినీ స్టేజ్‌పై చూసిన అభిమానుల రెస్పాన్స్‌ పసిగట్టిన కొరటాల అండ్‌ టీమ్‌, ఈ కాంబో మన సినిమాలో ఉంటే ఆ వెయిటే సూపర్‌ హిట్టు.. అని భావించిందట. అంతే, ఇమ్మీడియట్‌గా అనసూయకి హ్యాండిచ్చేసి, ఆ పాత్రకు అత్యథిక మెరుగులద్ది విజయశాంతిని ప్రవేశపెట్టే యోచన చేస్తున్నారట. ప్రస్తుతం ఇదే ఇండస్ట్రీ హాట్‌ టాపిక్‌గా మారింది. దాంతో చిరు సినిమాలో విజయ శాంతి ఫిక్సయినట్లేనా.? అంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురుస్తోంది.

 

విజయ శాంతి సంగతి సరే, పాపం అనసూయ.. చిరంజీవి సినిమాలో ఛాన్స్‌ వచ్చిందని పండగ చేసుకుంటోంది. ఆమె ఆశలు ఆడియాశలేనా.? మరోవైపు చిరు సినిమా నుండి అనసూయని తప్పించడం వెనక ఇవే కాక పలు రకాల కారణాలున్నాయంటూ గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. అవేంటో, తెలియాలంటే చిత్ర యూనిట్‌ నుండి కానీ, అనసూయ నుండీ అఫీషియల్‌ రెస్పాన్స్‌ రావల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS