'యాత్ర' సినిమాలో అనసూయ లుక్‌ చూశారా.?

మరిన్ని వార్తలు

రంగమ్మత్త ఇప్పుడు రాజన్న బిడ్డయ్యిందా.? లేక చేవెళ్ల చెల్లెలయ్యిందా.? ఏంటీ పోలికలు అనుకుంటున్నారా.? అవును 'రంగస్థలం' సినిమాలో 'రంగమ్మత్త'గా ఆకట్టుకున్న అనసూయ తాజాగా 'యాత్ర' సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. 'ఆనందోబ్రహ్మ' ఫేం మహి .వి.రాఘవ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 

కాగా తాజాగా ఈ సినిమాకి సంబంధించి షూటింగ్‌ స్పాట్‌లో తీసిన పిక్‌ ఒకటి అనసూయ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ఈ ఫోటో చూసి 'యాత్ర' సినిమాలో అనసూయది రాజశేఖర్‌రెడ్డి కూతురు షర్మిల పాత్రనీ, కాదు కాదు ఆయన చేవెళ్ల సోదరిగా పిలుచుకునే సబితా ఇంద్రారెడ్డి పాత్ర అనీ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే పాత్ర ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్సే కానీ, రంగమ్మత్త టాలెంట్‌కి ఖచ్చితంగా అది ఇంపార్టెన్స్‌ ఉన్న పాత్రే కావడం ఖాయం. 

దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాజశేఖర్‌ రెడ్డి పాత్రలో ప్రముఖ మలయాళ నటుడు ముమ్ముట్టి నటిస్తున్నారు. ఆయన ఈ సినిమా కోసం తెలుగులో డబ్బింగ్‌ కూడా చెప్పుకోవడం విశేషం. ప్రస్తుతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. డిశంబర్‌ 21న 'యాత్ర' ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇదిలా ఉంటే అనసూయ ప్రధాన పాత్రలో మరో సినిమా తెరకెక్కుతోంది. 'కథనం' అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో అనసూయ జర్నలిస్టు పాత్రలో కనిపించనుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS