అనసూయ జిల్‌జిల్‌ జిగేల్‌ మాయ.!

By iQlikMovies - July 09, 2018 - 10:42 AM IST

మరిన్ని వార్తలు

'అనసూయ' ఆ పేరులోనే ఏదో మాయ ఉంది. ఆడపిల్లలకు అసూయ పుట్టించే అందం ఆమెలో దాగుంది. వయసు విషయం అందరికీ తెలిసినా, ఇద్దరు పిల్లల తల్లి అన్న విషయం కూడా అందరికీ ఎరుకే అయినా, ఆమె అందం విషయానికి వచ్చేసరికి ఎంతటి వారైనా మంత్ర ముగ్ధులు కావాల్సిందే. మత్తుల్లో తేలి ఊయలూగాల్సిందే. బుల్లితెరపై సెలెక్టివ్‌గా ప్రోగ్రామ్స్‌ చేస్తూ బెస్ట్‌ హాటెస్ట్‌ యాంకర్‌గా పేరు తెచ్చుకుంటోంది. అలాగే వెండితెరపై అనసూయ కోసం పుట్టుకొస్తున్న పాత్రలు నటిగా ఆమెను ఒక్కో స్టెప్పు పైకెక్కేలా చేస్తున్నాయి. 'క్షణం' సినిమాలో అనసూయ నటించిన పోలీసాఫీసర్‌ పాత్ర ఒకెత్తు అనుకుంటే, 'రంగస్థలం'లో 'రంగమ్మత్త' పాత్ర అల్టిమేట్‌ అని చెప్పాలి. ఇక ఇప్పుడు మెగా ప్రిన్స్‌ - వెంకీ కాంబోలో తెరకెక్కుతోన్న 'ఎఫ్‌ 2'లోనూ ఓ స్టన్నింగ్‌ క్యారెక్టర్‌లో అనసూయ కనిపించబోతోంది. ఇవన్నీ ఇలా ఉంటే, సోషల్‌ మీడియాలోనూ ఆమె జిగేల్‌ మెరుపులకు ఆమెకి ఆమె సాటి. చూశారుగా ఈ ఫోటోలో అనసూయ అందం కెవ్వుకేక అనిపించట్లే.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS