అనసూయకి ఆ క్లారిటీ వుంది.. సంతోషం.

మరిన్ని వార్తలు

ఎస్.వి కృష్ణారెడ్డి తీసిన 'ధీర్గ సుమంగళి భవ'' సినిమా గుర్తుందా? ఆల్రెడీ పెళ్లి చేసుకొని ఓ బిడ్డకి తల్లయిన రమ్యకృష్ణని ''నీ అందానికి సినిమాల్లోకి వెళితే టాప్ హీరోయిన్ అయిపోతావ్'' అని ఓ వెదవ సలహా ఇస్తే.. ఆ సలహాని పట్టుకొని కుటుంబం వదిలి.. ముంబాయ్ వెళ్ళిపోయి జీవితం సర్వనాశనం చేసుకుటుంది రమ్యకృష్ణ. ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకంటే.. యాంకర్ అనసూయకి కూడా ఇదే సలహా ఇస్తున్నారట. ‘ఎందుకు త్వరగా పెళ్లి చేసుకున్నావ్? కొంచెం ఆగుంటే టాప్‌ హీరోయిన్‌ అయిపోయేదానివి.

 

అయినా మించిపోయినది లేదు. ఊరికే కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలు పోస్ట్‌ చేయకు. డిమాండ్ తగ్గిపోతుంది'' ఇలా వుంటున్నాయట ఆనుసుయాకి ఇచ్చే సలహాలు. అయితే ఇలాంటి సహాలలు ఇచ్చేవారిందరికీ సరైన సమాధానం చెప్పింది అనసూయ. ''మీ సలహాలకు థ్యాంక్స్. నేను జీవితంలో సంపాదుంచుకున్న విలువలైన ఆస్తి నా కుటుంబం. నేను పొందిన వాటిలో అన్నింటికంటే గొప్పది నా కుటుంబం. ఈ విషయంలో ఎప్పటికీ గర్వపడతాను. ఇప్పుడు నేనున్నా స్థానంలో చాలా ఆనందంగా వున్నాను. ఇంతకంటే గొప్ప ఆశలు లేవు'' అని చెప్పింది అనసూయ. మొత్తానికి ఇలాంటి బిస్కెట్ సలహాలు పట్టుకొని తాను మునగ చెట్టు ఎక్కిపోనని ఫుల్ క్లారిటీగా చెప్పిందీ జబర్దస్త్ యాంకర్.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS