బుల్లితెర నుండి వెండితెర మీదికి ఎంట్రీ ఇచ్చిన హాట్ యాంకర్ అనసూయ 'రంగస్థలం' సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత ఆమెకు చాలానే ఆఫర్లు వచ్చినా అమ్మడు ఆచితూచి పాత్రల్ని ఎంచుకుంటోంది. ప్రధానంగా లేడీ ఒరియెంటెడ్ కథల్ని, ప్రత్యేకత, కథలో ప్రాధాన్యం కలిగిన పాత్రల్ని మాత్రమే చూజ్ చేసుకుంటూ వస్తోన్న అనసూయకు కృష్ణవంశీ 'రంగమార్తాండ' సినిమాలో ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందే.
తన ఫేవరెట్ దర్శకుడు కృష్ణవంశీ నుండి ఆఫర్ అందుకున్న అనసూయ ఆయన చెప్పిన పాత్ర కథలో కీలకంగా ఉండటంతో వెంటనే ఓకే చెప్పేసిందట. కాగా ఈ సినిమాలో అనసూయ పాత్ర విషయానికి వస్తే.. నాటకాలు వేసే ఓ రంగస్థలం నటిగా నటించనుందట. అలాగే సినిమాలో సీన్స్ కి అనుగుణంగా ఓ ప్రత్యేక సాంగ్ లో కూడా అనసూయ నటించాల్సి ఉంటుందట. కాగా ఒరిజినల్ వెర్షన్ లో నానా పటేకర్ పోషించిన పాత్రను ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ చేస్తుండగా.. ఇక ప్రకాష్ రాజ్ సరసన రమ్యకృష్ణ నటిస్తోంది.
కృష్ణవంశీ దాదాపు 20 సంవత్సరాల తరువాత తన సతీమణిని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాని అభిషేక్ అండ్ మధు నిర్మిస్తున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా 'కృష్ణ వంశీ' సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోతున్నాయి. మరి ఈ సినిమాతోనైనా మళ్ళీ కృష్ణవంశీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.