అనసూయ రేంజ్.. నానాటికీ పెరుగుతూనే ఉంది. వయసు మీద పడుతున్నా - ఆమెలోని ఆకర్షణ, సెక్సపీల్ ఏమాత్రం తగ్గలేదు. రంగస్థలంలో రంగమ్మత్త - ఆమె కెరీర్‌కు ఊపు తెచ్చింది. ఆ తరహా పాత్రలకు ఆమె బాగా సూటవుతుందన్న నమ్మకం కలిగించింది. అందుకే వరుసగా ఆమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవల ఆమె కోలీవుడ్ లోనూ అడుగుపెట్టింది. విజయ్ సేతుపతి సినిమాలో ఓ కీలకమైన పాత్ర పోషిస్తోంది.
ఈ సినిమాలో అనసూయ పాత్రకు సంబంధించిన ఓ అప్ డేట్ ఇప్పుడు వచ్చింది. ఇందులో అనసూయ సిల్క్ స్మిత ని పోలిన పాత్ర పోషిస్తోందట. 80 దశకంలో దక్షిణాదిన ఓ ఊపు ఊపేసిన తార.. సిల్క్ స్మిత. శృంగార తారగా బహుళ గుర్తింపు పొందింది. ఇప్పుడు ఆ పాత్రలోనే.. అనసూయ కనిపించబోతోందని సమాచారం. అలాగని విజయ్‌సేతుపతి సినిమా బయోపిక్కో, నిజ జీవిత కథో కాదు. మరి సిల్క్ పాత్ర ఈ సినిమాలోకి ఎలా వచ్చిందన్న ఆసక్తి నెలకొంది. దర్శకుడు అనసూయని ఎలా చూపిస్తాడో ఏంటో??