హాట్ హాట్ రంగమ్మత్త తిరిగొచ్చేసిందోచ్‌.!

మరిన్ని వార్తలు

హాటెస్ట్‌ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న బుల్లితెర నటి 'అనసూయ' హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రోగ్రాంస్‌లో ఈ మధ్య వేరే యాంకర్స్‌ సందడి చేస్తున్నారు. దాంతో అనసూయకు ఏమైంది.? ఎక్కడుంది.? అంటూ అభిమానులు కంగారు పడ్డారు. అయితే అనసూయ ఈజ్‌ బ్యాక్‌. బుల్లితెరపై ప్రోగ్రాంస్‌ చేస్తూనే వెండితెరపై కూడా అనసూయ ఫుల్‌ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. షూటింగ్‌ నిమిత్తం అందుబాటులో లేని కారణంగా అనసూయ ప్లేస్‌ని వేరే యాంకర్స్‌ భర్తీ చేశారంతే.

ఇప్పుడు అనసూయ ఫ్రీ అయిపోయింది. వెంటనే తన ప్రోగ్రాంస్‌లో జాయిన్‌ అయిపోయింది. అదే విషయాన్ని ట్విట్టర్‌లో ప్రస్థావించింది అనసూయ. అదేదో సినిమాలో ఓ హీరోయిన్‌ చెప్పినట్లు, నేను కనిపించకపోతే చచ్చిపోయేవాళ్లూ, నన్ను చూడకుంటే పిచ్చెక్కిపోయే వాళ్లు చాలా మందే ఉన్నారక్కడ అన్నట్లు.. అనసూయ రాకపోవడంతో మరీ చచ్చిపోయే వాళ్లు కాకపోయినా, లోటుగా ఫీలైన వాళ్లు ఉన్నారండోయ్‌. ఆ లోటు తీర్చేందుకు అనసూయ వచ్చేసింది.

ఈ వారం 'జబర్దస్త్‌', 'రంగస్థలం' తదితర ప్రోగ్రాంలు మన రంగమ్మత్త హోస్టింగ్‌లోనే నిర్వహించబడతాయన్న మాట. ఇకపోతే వెండితెర విషయానికి వస్తే 'రంగస్థలం'లో రంగమ్మత్తగా సత్తా చాటిన అనసూయ వరుణ్‌తేజ్‌, వెంకటేష్‌ మల్టీస్టారర్‌ 'ఎఫ్‌ 2'లో ఇంపార్టెంట్‌ పాత్ర పోషిస్తోంది. అలాగే దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బయోపిక్‌ 'యాత్ర'లోనూ కీలక పాత్ర పోషిస్తోంది. త్వరలోనే ఈ సినిమాలతో అనసూయ ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS