ప్రముఖ యాంకర్ ప్రదీప్ అరెస్ట్!
ఇలా ఒక వార్త గత రెండు మూడు రోజుల నుండి వివిధ వెబ్ సైట్స్ లో దర్శనమిస్తున్నది. ఆ వార్త సారాంశం ఏంటంటే- హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ కోర్టు చెక్ బౌన్స్ కేసులో ప్రదీప్ కి జైలు శిక్ష విదించిందట! ఆ వెంటనే ప్రదీప్ ని చంచల్ గూడ జైలుకి తరలించడంతో, ప్రదీప్ తరపున లాయరు కోర్టులో బెయిల్ పొంది అందుకు తగిన పూచికత్తు చెల్లించడంతో ప్రదీప్ ని ఆ వెంటనే విడుదల చేసారట.
అయితే ఈ విషయమై ప్రదీప్ కాని ఆయన సన్నిహితులు ఇంతవరకు స్పందించలేదు. అసలు ఇంతకి నిజంగా ఇదంతా జరిగిందో లేదో కూడా తెలియదు..