తెలుగులో ఫ్రాంచైజీలు పెద్దగా లేవు. అప్పుడెప్పుడో మనీ వచ్చింది. ఆ తరవాత అలాంటి ప్రయత్నాలు ఒకట్రెండు జరిగినా, పెద్దగా ఫలితం లేదు. కానీ ఎఫ్ 3కి మాత్రం విపరీతమైన క్రేజ్ మొదలైంది. ఫ్రాంచైజీకి కావల్సినంత స్టఫ్..ఎఫ్ 2 కథకు ఉంది.కాబట్టి... ఎఫ్ 3పై దృష్టి పెట్టాడు అనిల్ రావిపూడి. ఎఫ్ 2లో ఇద్దరు హీరోల్ని తీసుకురావడం బాగా కలిసొచ్చింది. ఎఫ్ 3లోనూ ముగ్గురు హీరోలు కనిపిస్తారని ప్రచారం జరిగింది. కానీ.. అనిల్ రావిపూడి మాత్రం ఈసారీ వెంకీ, వరుణ్‌లతోనే ఎడ్జిస్ట్ అయిపోయాడు. నిజానికి మరో హీరోని తీసుకొచ్చే ఆలోచనా అనిల్ రావిపూడికి ఉంది. ఈ విషయం తనే చెప్పాడు.
``ఎఫ్ 3లో మూడో హీరోని చూపించాలనుకున్న మాట నిజమే. అయితే మూడో హీరో అనేది.. ఈ ఫ్రాంచైజీకి ట్రంప్ కార్డు లాంటిది. దాన్ని ఇప్పుడే వాడదలచుకోలేదు. మున్ముందు ఎఫ్ 4, 5, 6 వస్తూనే ఉంటాయి. వాటిలో వాడడానికి నాకు ఆ ట్రంప్ కార్డు ఉపయోగపడుతుంది`` అని హింట్ ఇచ్చేశాడు రావిపూడి. ఎఫ్ 3 హిట్టయితే.. వెంటనే ఎఫ్ 4కీ సన్నాహాలు మొదలైపోతాయి. బాలయ్య సినిమా పూర్తయిన వెంటనే ఎఫ్ 4 షురూ అవుతుంది. ఎఫ్ 4లో మాత్రం కచ్చితంగా.... ఓ కొత్త హీరో కనిపిస్తాడు. ఆ హీరో ఎవరన్నది ప్రస్తుతానికి ఆసక్తిగా మారింది. 99 శాతం... రవితేజకే ఆ ఛాన్స్ ఉందన్నది టాలీవుడ్ టాక్. రవితేజతో.. రాజా ది గ్రేట్ తీశాడు అనిల్. ఆ సినిమా హిట్టు. పైగా కామెడీ జోనర్‌లో రవితేజకు తిరుగులేదు. సో.. ఎఫ్ 4 గనుక వస్తే.. ఆ ట్రంప్ కార్డు.. రవితేజనో అయ్యే ఛాన్సుంది.