'ఎఫ్ 2'కి సీక్వెల్ గా ఎఫ్ 3 తీస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు మరో సీక్వెల్ పై దృష్టి సారించినట్టు సమాచారం. రవితేజ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో `రాజా దిగ్రేట్` వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా `రాజా ది గ్రేట్ 2` సినిమా తీయబోతున్నట్టు టాక్.
కరోనా సమయంలో `ఎఫ్ 3` స్క్రిప్టుని పూర్తి చేసిన అనిల్ రావిపూడి.. ఆ వెంటనే.. `రాజా ది గ్రేట్ 2` పనులూ మొదలెట్టి నట్టు టాక్. ఈ ఐడియా.... రవితేజకు చెప్పడం, ఆయనా ఓకే అనడం జరిగిపోయాయని సమాచారం. రవితేజకి కూడా.. మరోసారి అనిల్ రావిపూడితో పనిచేయాలని వుంది. సో.. ఈ కాంబినేషన్‌కి ఇక తిరుగులేనట్టే. అయితే ముందు గా `ఎఫ్ 3` మాత్రమే మొదలవుతుంది. ఆ తరవాతే... రాజా ది గ్రేట్ 2 పట్టాలెక్కుతుంది.