తెలుగమ్మాయి అంజలి టాలీవుడ్‌లో పెద్దగా స్టార్‌డమ్ సంపాదించుకోనప్పటికీ, తమిళంలో మాత్రం స్టార్ హీరోయిన్‌గానే వెలుగు వెలుగుతోంది. అయితే ఇటీవల ఆమె చెల్లెలు ఆరాధ్య కూడా సినీ తెరంగేట్రం చేసింది. అక్క అంజలిలా హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంటాననీ ఆరాధ్య ఓ ఇంటర్య్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే అందుకు అంజలి స్పందించింది. ఆరాధ్య నా చెల్లెలు కాదని చెప్పింది అంజలి. ఆరాధ్య, అంజలి పిన్ని భారతీదేవి కూతురు. అంజలి ఈ స్థాయికి రావడానికి ఆమె పిన్ని సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయని టాక్. అలాగే గతంలో పిన్నితో అంజలి పలు రకాల గొడవలు పడిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఆ గొడవలు సద్దుమనిగాయనే భావించారంతా. కానీ అంజలి, ఆమె పిన్ని కూతురైన ఆరాధ్య విషయంలో చేసిన తాజా ప్రకటన నిమిత్తం అంజలికి, తన పిన్ని భారతీ దేవికి మధ్య గొడవలు ఇంకా సమసిపోలేదని అర్ధమవుతోంది. ఏది ఏమైనా అంజలి ఇలా చేయకుండా ఉండాల్సింది. ఇకపోతే ఆరాధ్య ఇప్పటికే తమిళ, కన్నడంలో నటిస్తోంది. అవకాశమొస్తే తెలుగులోనూ నటించడానికి రెడీగా ఉంది. అంజలికి స్టార్ హీరోస్‌తో నటించే అవకాశం వచ్చినప్పటికీ తెలుగులో స్టార్‌డమ్ మాత్రం రావడం లేదు. తమిళంలోనే ఆమె హవా కొనసాగుతోంది. తమిళ హీరో జైతో అంజలి ప్రేమాయణం సాగిస్తుందన్నది కూడా కోలీవుడ్ వర్గాల టాక్.