'వెయ్రా చెయ్ వెయ్రా.. ఎక్కడెక్కడో చెయ్ వెయ్రా..' అంటూ 'పంజా' సినిమాలో హాట్ హాటర్ హాటెస్ట్ సాంగ్‌లో చిందేసిన క్యూట్ బ్యూటీ గుర్తుంది కదా. పేరు అంజలీ లావానియా. ఇదే ఈ ముద్దుగుమ్మకి తొలి సినిమా. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసినా, అమ్మడిని ఎవ్వరూ గుర్తించలేదు. 'ఏం తింటున్నావే కస కసలాడిపోతున్నావ్' అంటూ ఆ సినిమాలో అమ్మడి అందానికి అడవిశేష్ ముగ్ధుడయిపోతూ చెప్పిన డైలాగ్ గుర్తొస్తోంది కదా. ఆ భామే ఈ భామ. మోడలింగ్ రంగం నుండి వచ్చింది. సినిమాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో లక్కీగా 'పంజా'లో ఆ క్యారెక్టర్ కోసం ఈ ముద్దుగుమ్మని ఎంచుకున్నారు. అయితే ఆ తర్వాత ఇంకెక్కడా కనిపించలేదీ బ్యూటీ. మోడలింగ్ రంగంలోనే ప్రస్తుతం బిజీగా గడుపుతోంది. చాలా కాలం తర్వాత ఇలా సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. క్లీవేజ్ హాట్‌నెస్‌తో క్యూట్ అప్పీల్‌తో మరోసారి కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టేస్తోందిలా.!