అనూ బేబీ అంతకు మించి.!

By iQlikMovies - August 10, 2018 - 12:40 PM IST

మరిన్ని వార్తలు

నాగచైతన్య - అనూ ఇమ్మాన్యుయేల్‌ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'శైలజా రెడ్డి అల్లుడు'. మొన్నీ మధ్యనే విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మారుతి మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. ఆగష్టు 31న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సందర్భంగా ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరందుకున్నాయి. తాజాగా ఓ వీడియో సింగిల్‌ని విడుదల చేశారు. అనూ బేబీ.. అంటూ సాగే ఈ సాంగ్‌లో అనూఇమ్మాన్యుయేల్‌ని చైతూ టీజ్‌ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అనూ ఇమ్మాన్యుయేల్‌ కొంచెం హాట్‌గా, కొంచెం స్వీటుగా కనిపిస్తోంది. శారీలో మోడ్రన్‌గానూ, మోడ్రన్‌ వేర్‌లో హాట్‌గానూ కనిపిస్తోంది. అయితే ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్‌ని కొత్తగా చూపించబోతున్నాడట డైరెక్టర్‌ మారుతి. 

అనూ గ్లామర్‌ యాంగిల్‌ అందరికీ తెలిసిందే. తొలి సినిమా 'మజ్ను' మినహాయించి, ఇంతవరకూ ఆమె నటించిన అన్ని సినిమాల్లోనూ హాట్‌గానే కనిపించింది. అయితే తాజా సినిమా 'శైలజారెడ్డి అల్లుడు'లో మాత్రం డిఫరెంట్‌ హాట్‌నెస్‌ని చూపించబోతోందట. ఇకపోతే చైతూ నుండి సినిమా వచ్చి చాలా కాలమే అయ్యింది. 

'రారండోయ్‌ వేడుక చూద్దాం'తో హిట్‌ కొట్టిన చైతూ, ఆ తర్వాత వెంటనే 'యుద్ధం శరణం'తో నిరాశపరిచాడు. ఇప్పుడు వెంట వెంటనే రెండు సినిమాలతో రానున్నాడు. అదే ఒకటి 'శైలజారెడ్డి అల్లుడు' కాగా, మరోటి 'సవ్యసాచి'. ఈ రెండు సినిమాలపైనా అంచనాలు బాగున్నాయి. ఇక అనూ ఇమ్మాన్యుయేల్‌ ఫ్యూచర్‌ అయితే పూర్తిగా 'శైలజారెడ్డి' మీదే ఆధారపడి ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.!

 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS