గ్లామ్‌ షాట్‌: తళుక్కుమన్న 'కేరళ' సొగసు!

By Inkmantra - December 30, 2019 - 19:30 PM IST

మరిన్ని వార్తలు

మలయాళ బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్‌, కేరళలో కన్నా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ పాపులారిటీ సంపాదించింది. తెలుగులో అల్లు అర్జున్‌, పవన్‌ కళ్యాణ్‌ వంటి స్టార్‌ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ, ప్రస్తుతం ఒకటీ అరా సినిమాల్లో మాత్రమే నటిస్తోంది. ఆ మధ్య కుటుంబ సమస్యల కారణంగా కెరీర్‌కి దాదాపు గుడ్‌ బై చెప్పినా, ఆ సమస్యలు సద్దుమణిగాక మళ్ళీ కెరీర్‌పై దృష్టి పెట్టింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

While in Kerala 🌴🥥

A post shared by Anu Emmanuel (@anuemmanuel) on

ఇక, అసలు విషయానికి వస్తే తాజాగా అనూ ఇమ్మాన్యుయేల్‌ సోషల్‌ మీడియాలో పై ఫొటో పోస్ట్‌ చేసింది. కేరళ అందాల్ని ఈ అమ్మడి సొగసులు డామినేట్‌ చేస్తున్నాయనడం అతిశయోక్తి కాదేమో.. అనే స్థాయిలో గ్లామర్‌ ఒలకబోసేసింది అనూ ఇమ్మాన్యుయేల్‌. తెలుగులోనూ రీ-ఎంట్రీ కోసం ఎదురుచూస్తోన్న ఈ మలయాళ బ్యూటీకి ఛాన్సులెవరిస్తారో వేచి చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS