గ్లామ్‌షాట్‌: స్లిమ్‌ అండ్‌ స్లీకీ లుక్స్‌లో అనూ ఇమ్మాన్యుయేల్‌!

మరిన్ని వార్తలు

'మజ్ను' సినిమాతో తెరంగేట్రం చేసిన మలయాళ కుట్టీ అనూ ఇమ్మాన్యుయేల్‌ ఎగసి పడిన కెరటంలా ఉవ్వెత్తున ఎగసి తాకిడి తట్టుకోలేక పాతాళంలోకి పారిపోయింది. తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ హోదాని కొన్ని అడుగుల దూరంలోనే మిస్‌ చేసుకుంది. అప్పటి వరకూ యంగ్‌ హీరోస్‌తోనే సరిపెట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఎట్‌ ఏ టైమ్‌ ఇద్దరు మెగా హీరోలు అల్లు అర్జున్‌, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సరసన నటించి కెరీర్‌లో ఇక తిరుగే లేదనుకుంది. కానీ ఆ రెండు సినిమాలూ బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బోల్తా కొట్టేశాయి. ఆ తర్వాత నటించిన 'శైలజా రెడ్డి అల్లుడు' తదితర చిత్రాలు కూడా అనూని గట్టెక్కించలేకపోయాయి. దాంతో తెలుగులో పాప హవా పూర్తిగా పడిపోయింది. తమిళంలో ప్రస్తుతం ఒకట్రెండు చిత్రాల్లో నటిస్తున్న అనూ ఇమ్మాన్యుయేల్‌ మళ్లీ తెలుగులో నిలదొక్కుకునే ప్రయత్నాలు మొదలుపెట్టిందట. ఆ క్రమంలో నెట్టింట్లో హాట్‌ ఫోటో షూట్‌తో రెచ్చిపోయింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anu Emmanuel (@anuemmanuel) on

ఓ మోడరన్‌ టాప్‌ ధరించి వయ్యారంగా చేతుల పైకెత్తి ఓ చిలిపి పోజిచ్చింది. ఇంకేముంది చక్కనమ్మ చిలిపితనానికి కొంటె కుర్రగాళ్లు బ్యూటిఫుల్‌గా కామెంట్స్‌ పోస్ట్‌ చేస్తున్నారు. నిజమే, ఈ పిక్స్‌లో అనూ స్లిమ్‌ అండ్‌ స్లీకీ లుక్స్‌ కుర్రకారులో కొత్త కోరికలు పుట్టిస్తున్నాయి. మరి ఆ కోరికలు మన దర్శక, నిర్మాతల్లోనూ కలిగితే పాప కోరిక తీరినట్లే. దశ తిరిగినట్లే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS