సంతోషంగా, జాలీగా కనిపిస్తున్న నలుగురు అందమైన అమ్మాయిలు. అనుకోని సంఘటన. వారి ముఖంలోని ఆనందాల్ని, చిరునవ్వుల్ని చెరిపేసింది. భయం గుప్పిట్లోకి నెట్టేసింది. అసలా అందమైన అమ్మాయిల జీవితంలో చోటు చేసుకున్న ఆ వింత సంఘటన ఏంటీ? ఆ అమ్మాయిలు అనుకున్నది ఏంటీ.? అయ్యింది ఇంకేంటీ? అసలిదంతా ఏంటీ? అనుకుంటున్నారా? ఓ కొత్త సినిమా. నలుగురు అమ్మాయిల ప్రధాన పాత్రలో తెరకెక్కుతోంది. లేటెస్ట్‌గా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని హీరో నితిన్ రిలీజ్ చేశారు. పోస్టర్‌ని బట్టి, కాన్సెప్ట్‌పై ఓ మోస్తరు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది చిత్ర యూనిట్. టూ వేరియేషన్స్‌లో ఈ పోస్టర్‌ని డిజైన్ చేశారు.
Here is the first look of #AnukunnadhiOkkatiAyyindhiOkkati
— nithiin (@actor_nithiin) November 13, 2019
Wishin the entire team all the best@DhanyaBee,@iamtridha,@SiddhiIdnani @komaleeprasad
Dir- @baluadusumilli
Prod- @srinivasvegi1
Prod- #HimaVelagapudi@MaturuMurali#AOAOFirstLook #BlackandWhitePictures #PoorviPictures pic.twitter.com/2yC9ic7xCS
ఇంతకీ ఈ సినిమాలో నటిస్తున్న ఆ నలుగురు భామల పేర్లు.. సిద్దీ ఇద్నానీ, ధన్యా బాలకృష్ణన్, కోమలీ ప్రసాద్, త్రిథా చౌదరి. ఫన్ అండ్ ఫియర్ కాన్సెప్ట్‌తో డిజైన్ చేసిన ఈ పోస్టర్ క్యూరియాసిటీ కలిగిస్తోంది. భాను అడుసుమిల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. హిమ వెలగపూడి నిర్మాణంలో బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్, పూర్వీ పిక్చర్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాని రూపొందిస్తున్నాయి.