Happy Birthday Review: 'హ్యాపీ బర్త్ డే' మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

నటీనటులు: లావణ్య త్రిపాఠి, నరేష్ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్
దర్శకత్వం : రితేష్ రానా
నిర్మాత: చిరంజీవి (చెర్రీ) & హేమలత పెదమల్లు
సంగీత దర్శకుడు: కాల భైరవ
సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్


రేటింగ్: 2.25/5


తక్కువ కాలంలోనే నెంబర్ నిర్మాణ సంస్థగా పేరుతెచ్చుకుంది మైత్రీ మూవీ మేకర్స్. వారి నుండి సినిమా వస్తుందంటే ఒక నమ్మకం. హ్యాపీ బర్త్ డే పై కూడా అలానే పాజిటివ్ బజ్ ఏర్పడింది. మత్తువదలరా తో ఆకట్టుకున్న రితేష్ రానా దర్శకుడు కావడం, లావణ్య త్రిపాఠి తోపాటు వెన్నెల కిషోర్, సత్య లాంటి ప్రామెసింగ్ నటులు కనిపించడం ఆసక్తిని పెంచింది. పైగా సర్రియల్ కామెడీ అనే కొత్త జోనర్ తో సినిమా చేస్తున్నామని చెప్పారు. ఇంతకీ ఏమిటా సర్రియల్ కామెడీ అని తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్ళాలి.


కథ


రిత్విక్ సోధి (వెన్నెల కిషోర్) రక్షణ మంత్రి. ఇంటింటికి కుళాయి పథకంలా ప్రతి మనిషికి ఒక గన్ వుండాలని బిల్లుని పాస్ చేస్తాడు. హ్యాపీ (లావణ్య త్రిపాఠి) రిట్జ్ గ్రాండ్ అనే హోటల్ లో తన పార్టీని జరుపుకోవడానికి వెళ్తుంది. గన్ బిల్లుకి, హ్యాపీ... బర్త్ డేకి ఏంటి సంబంధం? అనేది మిగిలిన కథ.


విశ్లేషణ :


ఏంటి..? కథ ఇంతేనా...? అని మీకు అనిపిస్తే తప్పులేదు. ఈ సినిమా కథ ఇంతే. ఇంతకుమించి వివరంగా చెబితే తికమకపడిపోయే ప్రమాదం వుంది. ఈ సినిమా కథ గురించి దర్శక నిర్మాతలు పెద్దగా పట్టించుకోలేదు కాబట్టి మనం కూడా దాన్ని పక్కన పెట్టేసి మిగతా అంశాలు గురించి మాట్లాడదాం. 

హాప్పీ బర్త్ డే సర్రియల్ కామెడీ జోనర్ అన్నారు. సర్రిలిజం అనేది ఒకరకమైన సాహిత్య ప్రక్రియ. సింపుల్ గా అర్ధమయ్యేలా చెప్పాలంటే లాజిక్స్ కి అందని ఒక వింత ఊహా అని చెప్పొచ్చు. ఉదాహరణకు ''ఆమె నుదుటి నుండి రాలిన సింధూరం సముద్రాన్ని మింగేసింది'' ఈ వాక్యంలో ఎక్కడైనా లాజిక్ ఉందా? సింధూరం, సముద్రాన్ని మింగడం ఏమిటి ? అదంతే. అదో ఊహా. కవి తను ఊహాని రాస్తాడు. రీడర్ తన ఊహాని బట్టి దాన్ని అర్ధం చేసుకుంటాడు.


దర్శకుడు రితిష్ రానా కూడా ఒక సర్రియల్ ప్రపంచాన్ని ఊహించుకున్నాడు. రిట్జ్ గ్రాండ్ అనే ఒక హోటల్. ఆ హోటల్ లో వింతవింత పాత్రలు. ఏ పాత్ర ఎందుకు వస్తుందో ముందస్తుగా ఎలాంటి సమాచారం వుండదు. తెరపై జరిగిన తంతుని చూస్తూ వుండాలి. ఇలా ఎందుకు వుంది ? అని అడగడానికి లేదు. ఎందుకంటే చాలా క్లియర్ చెప్పారు. ఇది సర్రియల్ కామెడీ అని. దర్శకుడు ఊహించింది తీసుకుపోయాడు. ఎదో కొత్తదనం చూపించాలనే దర్శకుడి తపన ఓకే. ఐతే సినిమా అనేది అల్టిమేట్ గా వినోదం. ఆ వినోదం పంచడంలో హ్యాపీ బర్త్ డే వెనకబడిపోయింది.


జరిగిన సంఘటనలని ఏడు చాప్టర్లు గా విడదీసి క్వెంటిన్ టరాన్టినో ఫల్ప్ ఫిక్షన్ తరహాలో స్క్రీన్ ప్లేయ్ చేసుకున్నాడు రితీష్ రానా. ప్రతి ఎపిసోడ్ లో ఒక క్యారెక్టర్ ని దాచేసి, రెండో ఎపిసోడ్ లో ఆ పాత్రని రివిల్ చేస్తూ, ఆ పాత్ర కోణం నుండి మరో ఎపిసోడ్ కి లీడ్ తీసుకుంటూ సంఘటనలని నడిపారు. ఇది ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేయ్ నే. ఐతే దర్శకుడు ఎంచుకున్న సర్రియల్ కామెడీకి ఈ స్క్రీన్ ప్లేయ్ అతకలేదు. జరుగుతున్న తతంగం లాజిక్ కి దూరంగా వుంటుంది, ఇందులో ఫల్ప్ ఫిక్షన్ స్క్రీన్ ప్లేయ్ ని మిక్స్ చేసి గంధరగోళం చేసి 
పారేశారు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని నవ్వుకునే సన్నీవేషాలు కుదిరాయి కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆడియన్ కి స్క్రీన్ తో కనెక్షన్ కట్ అయిపొయింది. హ్యాపీ డబుల్ యాక్షన్, జైలు ఎపిసోడ్, తెగువ బ్లాక్ ఇవన్నీ అస్సల్ పేలలేదు. సెకండ్ హాఫ్ మొత్తానికి సత్య చేసిన అనువాదం సీన్ ఒక్కటే కాస్తో కూస్తో నవ్వు తెప్పించగలిగింది. 


నటీనటులు:


హ్యాపీ పాత్రలో చేసిన లావణ్య త్రిపాఠి కి ఇది కొత్త పాత్రే. చాలా యాక్టివ్ గా ఎనర్జీటిక్ గా చేసింది. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ పాత్ర సత్యది. చాలా సన్నీవేషాల్లో నవ్వించగలిగాడు.

 

వెన్నెల కిషోర్ పాత్రని క్లైమాక్స్ కి పరిమితం చేశారు. నరేష్ అగ్యస్త, రాహుల్ రామకృష్ణ పర్వేలేదనిపించారు. వాట్సప్ కొటేషన్లు పేల్చే గుండు సుదర్శన్ చివర్లో కాస్త నవ్వించారు. మిగతా పాత్రలు పెద్దగా రిజిస్టర్ కావు.


టెక్నికల్ గా:


కాల భైరవ ఇచ్చిన నేపధ్య సంగీతం ట్రెండీగా వుంది. కెమరా పనితనం బావుంది. సినిమా అంతాఒక హోటల్ లోనే తీసేశారు.

నిర్మాణ విలువలు బావున్నాయి. సర్రియల్ కామెడీ అన్నారు కాబట్టి లాజిక్స్ గురించి అడగడం లేదు. కానీ ఎంత సర్రియల్ కామెడీ చేసినా.. కథ, పాత్రల నిర్మాణం పటిష్టంగా వుండాలి. అవి బలంగా ఉన్నపుడే ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. ఈ సినిమా చూసి బయటికి వచ్చిన తర్వాత ఒక్క పాత్ర కూడా మళ్ళీ గుర్తుకు రాదు. దీని బట్టి అర్ధం చేసుకోవచ్చు ఇది ఎలాంటి సినిమానో.

 

ప్లస్ పాయింట్స్ :

 

కొన్ని కామెడీ సీన్లు 

నేపధ్య సంగీతం 

నిర్మాణ విలువలు 

 

మైనస్ పాయింట్స్

 

కామెడీ పేలకపోవడం 

బలహీనమైన కథ 

సెకండ్ హాఫ్

 

ఫైనల్ వర్దిక్ట్ : వెరీ సాడ్ బర్త్ డే!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS