తాజాగా 'భాగమతి' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన స్వీటీ బ్యూటీ అనుష్కకు కొన్ని కష్టాలు తీరడం లేదు. సినిమా విడుదలకు ముందు అనుష్క ఈ సినిమాలో చాలా సన్నగా ఉంటుందట. 'సైజ్‌జీరో' కోసం పెంచిన ఒళ్లును తగ్గించేసుకుని చాలా సన్నగా మారిపోయిందట అంటే నిజమేనేమో అనుకున్నారంతా. కానీ 'భాగమతి'లో అనుష్క చాలా లావుగా కనిపించిందంటూ కామెంట్లు వస్తున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్‌లో కూడా అనుష్క చాలా లావుగా కనిపిస్తోంది.
అనుష్క అంటే సన్నగా తీగలా ఉండే శరీర సౌందర్యం. అలాంటిది 'సైజ్‌జీరో' కోసం చేసిన రిస్క్‌తో ఇంకా ఆ భారం తగ్గించుకోలేకపోతోంది. ఏ హీరోయిన్ చేయని సాహసం చేసింది అనుష్క 'సైజ్‌జీరో' సినిమా కోసం. అంత కష్టపడినందుకు ఆ సినిమా రిజల్ట్ పోజిటివ్‌గా వచ్చి ఉంటే బావుండేది. కానీ రివర్స్ అయ్యింది. సినిమా చూస్తుంటే, ప్రతీ షాట్‌లోనూ అనుష్క పడిన కష్టానికి ఆమెకు సానుభూతి దక్కిందే తప్ప, విజయం మాత్రం కట్టబెట్టలేకపోయారు ప్రేక్షకులు. ఆ రిస్క్ ఇంకా అనుష్కను వెంటాడుతూనే ఉంది. 'బాహుబలి' సినిమా షూటింగ్ 'సైజ్‌జీరో' కన్నా ముందే అయిపోవడంతో ఆ సినిమాకి అనుష్క బరువు ప్రోబ్లం కాలేదు. కానీ ఎన్ని కసరత్తులు చేసినా 'భాగమతి' కోసం అనుష్క లావు తగ్గలేకపోయింది.
ఇక రాబోయే సినిమాల్లో కూడా అనుష్క ఇలాగే ఉంటే కష్టమే. అందుకే ప్రస్తుతం భాగమతి తర్వాత అనుష్క కొత్త ప్రాజెక్టులు సైన్ చేయలేదట. బరువు బాగా తగ్గి, ఇదివరకటి నాజూకుతనం పొందిన తర్వాతే కొత్త సినిమాలకు సైన్ చేస్తానని స్వీటీనే స్వయంగా చెబుతోంది. ప్రేక్షకులు కూడా అనుష్క నుండి ఆశించేది అదే. అనుష్క బరువు కొంచెం ఇబ్బంది పెట్టినా, తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'భాగమతి' ఆకట్టుకునే థ్రిల్లింగ్ అంశాలతో మంచి టాక్‌తోనే దూసుకెళ్తోంది.