ప్రస్తుతం ఆచార్య హడావుడిలో ఉన్నాడు చిరంజీవి. మేలో విడుదల కావాల్సిన సినిమా ఇది. సెకండ్ వేవ్ పుణ్యాన... అన్ని సినిమాలతో పాటు ఆచార్య కూడా వాయిదా పడింది. ఆచార్య ముగిసిన వెంటనే `లూసీఫర్` రీమేక్ మొదలెట్టే ఆలోచనలో ఉన్నాడు చిరు. లూసీఫర్ స్క్రిప్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మోహన్ రాజా దర్శకుడు. ఈ చిత్రంలో కథానాయికగా అనుష్క దాదాపుగా ఖాయమని తెలుస్తోంది.
నిజానికి `లూసీఫర్` మాతృకలో కథానాయిక పాత్ర లేనే లేదు. కానీ తెలుగులో చిరంజీవి ఇమేజ్ కి తగినట్టు కొన్ని మార్పులూ చేర్పులూ చేయాల్సిన అవసరం ఏర్పడింది. అందులో భాగంగా కథానాయిక పాత్రని ప్రవేశ పెట్టారు. అనుష్క పాత్ర తెరపై కనిపించేది కాసేపే అని, కానీ ఫ్యాన్స్ ని అలరించేలా తీర్చిదిద్దారని తెలుస్తోంది. ఇది వరకు చిరు `స్టాలిన్`లో ఓ ప్రత్యేకమైన గీతంలో మెరిసింది అనుష్క. ఆ తరవాత.. ఇద్దరూ ఒకే తెరపై కనిపించడం ఇదే తొలిసారి.