భళ్లాలదేవగా 'బాహుబలి' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరో రానా. 'బాహుబలి' సినిమా రానాలోని కొత్త యాంగిల్‌ని బయటికి తెచ్చింది. అలాగే ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టిన పాత్ర కూడా అదే. తాజాగా రానా 'ఘాజీ' సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. సంకల్ప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కథ ఇప్పుడున్న సినిమా కథలకి పూర్తి భిన్నంగా తెరకెక్కింది. ఎక్కువ భాగం ఈ సినిమా షూటింగ్ నీళ్లలోనే జరుగుతుంది. 1970 నాటి ఇండియా, పాకిస్థాన్ యుద్ధ నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. సబ్‌మెరైన్ ప్రధానాంశంగా ఈ సినిమాను రూపొందించారు. పివీపీ సంస్ధ, మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు ఈ సినిమాని. 'బాహుబలి' సినిమాతో భళ్లాలదేవగా వచ్చిన గుర్తింపు ఈ సినిమాతో కంటిన్యూ అవుతుందని అంటున్నారు రానాకి. ఈ సినిమాలో నటించడం నాకు చాలా గొప్పగా ఉందంటున్నాడు రానా. మామూలు కమర్షియల్ సినిమాల్లో నటిస్తే వచ్చే ఆనందం వేరు. ఇలాంటి చారిత్రక నేపధ్యం ఉన్న సినిమాల్లో నటిస్తే వచ్చే ఆనందం వేరు. దానికీ దీనికీ అస్సలు పొంతన ఉండదు అంటున్నాడు. ఆర్మీ ఆఫీసర్‌గా రానా బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనుందట. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా 'క్లీన్ యు' సర్టిఫికెట్‌ని సొంతం చేసుకుంది. ముద్దుగుమ్మ తాప్సీ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.