గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూడేళ్ళ తరవాత గేమ్‌ఛేంజర్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. సినిమా పై కావాలనే నెగిటివ్ ప్రచారం చేసారని మెగా ఫాన్స్ వాదన. నెక్స్ట్ చెర్రీ RC16 మూవీ చేస్తున్నాడు. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మధ్యే కుంభమేళా బ్యూటీ మోనాలిసాని కూడా సెకండ్ హీరోయిన్ గా బుచ్చి బాబు ఫిక్స్ చేసారని సమాచారం. RC16 షూటింగ్ షెడ్యూల్ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. మొదటి షెడ్యూల్ మైసూర్ లో ముగియగా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్. రెహ్మాన్ సంగీత దర్శకుడిగా కన్ఫర్మ్ అయ్యారు. ఇప్పటికే రెండు పాటలు ట్యూన్స్ కూడా కంపోజ్ చేసి ఇచ్చారని సమాచారం.
రెహ్మాన్ చాలా రోజుల తరవాత నేరుగా ఒక తెలుగు సినిమాకి వర్క్ చేస్తుండటం గమనార్హం. ఆస్కార్ అవార్డు విన్నర్ రెహ్మాన్ ఈ మూవీకి పని చేయటం పెద్ద అచీవ్ మెంట్ గా భావించారు మెగా ఫాన్స్. కానీ ఇప్పుడు రెహ్మాన్ ఈ మూవీ నుంచి తప్పుకున్నారని టాక్. రెహమాన్ స్థానంలో దేవిశ్రీ ప్రసాద్ ని కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. బుచ్చి బాబు కావాలని పట్టుపట్టి మరీ రెహ్మాన్ ని తెచ్చుకున్నాడు. అలాంటిది ఇప్పడు రెహ్మాన్ ఈ సినిమా నుంచి తప్పుకోవటం చిత్రంగా ఉందని సర్వత్రా చర్చ జరుగుతోంది.
వీరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని కేవలం డేట్స్ అడ్జస్ట్ చేయలేక రెహ్మాన్ తప్పుకున్నటు టాక్. RC16 దసరాకి రిలీజ్ చేయాలని బుచ్చి బాబు ప్లాన్. ప్రస్తుతం రెహ్మాన్ బిజీగా ఉండటం వలన, దేవిశ్రీ అయితే బెస్ట్ అని మేకర్స్ భావన. పైగా పుష్ప 2 హిట్ తో మంచి జోష్ లో ఉన్నాడు దేవిశ్రీ. పాన్ ఇండియా లెవెల్లో దేవి కి ఫాలోయింగ్ పెరిగింది. ఇవన్నీ కూడా RC16 కి కలిసివచ్చే అంశాలే అని భావిస్తున్నారట మేకర్స్.