బిగ్ బాస్ ద్వారా ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకుంది అరియానా. రామ్ గోపాల్ వర్మ ని ఈమధ్య అంటి పెట్టుకుని ఉండడం వల్ల.. తనకు మరింత పాపులారిటీ వచ్చింది. ఇటీవల వర్మతో అరియానా ఓ బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. దాంతో సోషల్ మీడియాలో అరియానా పేరు మరింత నానిపోయింది. ఇప్పుడు ... అరియానా వెంటిలేటర్ పై ఉంది. ఆ ఫొటోని తానే షేర్ చేసింది. దాంతో అరియానాకి ఏం జరిగిందా? అని అంతా ఆశ్చర్యపోతున్నారు.
కానీ అసలు విషయం ఏమిటంటే... ఓ సినిమా కోసం ఇలాంటి సన్నివేశంలో నటించింది అరియానా. దాన్నే ఇన్‌స్టాలో షేర్ చేసింది. మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా చేస్తున్న సినిమాలో అరియానా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులోని ఓ సీన్ కోసం ఆమె ఆక్సీజన్ మాస్కుతో వెంటిలేటర్ మీద ఉన్నట్లు నటిస్తోంది. ఆ షూటింగ్ స్పాట్‌లో తీసిన వీడియోనే ఆరియానా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాతో పాటు.. నాలుగైదు ప్రాజెక్టులు అరియానా చేతుల్లో ఉన్నాయి. మొత్తానికి బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ ని అరియానా బాగానే క్యాష్ చేసుకుంది.