హీరో విశ్వక్‌సేన్ సినియర్ హీరో అర్జున్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన దర్శకత్వంలో విశ్వక్‌సేన్, ఐశ్వర్య సర్జా కీలక పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే, గత కొన్ని రోజులుగా చిత్ర బృందానికి, విశ్వక్‌సేన్‌కు మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. విశ్వక్‌సేన్ సినిమాకి డ్యామేజ్ చేసేలా ప్రవర్తిస్తున్నాడని ప్రెస్ మీట్ నిర్వహించారు.
''విశ్వక్‌సేన్ చేసిన పనికి బాధకలిగింది. కొత్త షెడ్యూల్ కోసం కష్టపడి సెట్‌ను డిజైన్ చేశాం. ఉదయాన్నే ఆరు గంటలకు షూటింగ్ స్పాట్‌కు రావాలని అందరికీ ముందే చెప్పా. ‘సర్ ఐయామ్ సారీ. ప్లీజ్ క్యాన్సిల్ షూట్’ విశ్వక్ మెసేజ్ పెట్టాడు. ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్ అంటే అతనికి మర్యాద లేదా? ఇది ఆయన గురించి చెడుగా ఆరోపణలు చేయడం కాదు. నా ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్లడం అంటే నా ప్రతిష్టకు దెబ్బ తగిలినట్లే. ఇలాంటి పరిస్థితుల్లో అతనితో నేను సినిమా చేయదలచుకోవడం లేదు.'' అని స్పష్టం చేశారు.
''సాయి మాధవ్ బుర్రా సంభాషణలు, చంద్రబోస్ పాటలు మనోడికి నచ్చడం లేదు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఇష్టపడటం లేదు. హీరోగా అతడు కొన్ని సూచనలు చేయొచ్చు తప్పులేదు. కానీ, ఒక మేకర్‌గా నాకు నచ్చాలి కదా?! చాలా సార్లు సర్ది చెప్పే ప్రయత్నం చేశా కానీ వినలేదు. ఇలాంటివి అందరికీ తెలియాలి. బయటకు మాట్లాడలేని నిర్మాతలు చాలా మంది ఉంటారు. నాకు ధైర్యం వుంది. అందుకే ఇలా చెబుతున్నా. ఇండస్ట్రీలో పద్ధతులు తెలియకపోతే, సినిమాలు చేయకండి. ఎవరి ఇంట్లో వాళ్లు ఉందాం. ఈ వివాదంపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ మెంబర్స్‌తో మాట్లాడతా. ఇలా మరొకరికి జరగకుండా చూడమని మాత్రమే చెబుతా. ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. వేరొక నటుడితో ఈ సినిమా మళ్లీ మొదలు పెడతా'' అని చెప్పారు.