పోయిన వారం విడుదలై ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న అర్జున్ రెడ్డి చిత్రం పై ఇప్పటికే కొన్ని వివాదాలు ఉన్నాయి. అడల్ట్ కంటెంట్ తో సభ్య సమాజానికి చేటు చేసేలా ఈ చిత్రం ఉందంటూ కొంత మంది ప్రముఖులు ఈ చిత్రాన్ని వ్యతిరేకిస్తున్నారు.
ఈ సమయంలో అసలు అర్జున్ రెడ్డి కథ నాదే అంటూ ఒకరు కోర్టు మెట్లెక్కడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే, ఖమ్మంకి చెందిన డి.నాగరాజు అనే వ్యక్తి ఈ కథ నాదేనంటూ అర్జున్ రెడ్డి టీం సభ్యులకి నోటిసులు పంపినట్టు తెలుస్తుంది.
తాను ఇప్పటికే దర్శకత్వం వహించి విడుదల చేసిన ‘ఇక సె లవ్’ అనే చిత్ర కథను యధాతధంగా అర్జున్ రెడ్డి చిత్రంలో చూపించినట్టు ఆయన ఆరోపిస్తున్నారట. తన కథతో సినిమా తీసి విడుదల చేసినందుకు, నష్ట పరిహారంగా వారం రోజుల్లోపు రెండు కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటానని నోటీసులో తెలిపాడు.
దీని పై అర్జున్ రెడ్డి టీం ఇంతవరకు స్పందించనప్పటికీ ఇది మరొక కొత్త వివాదంలో అర్జున్ రెడ్డి ఇరుక్కుంది అని చెప్పొచ్చు.