అర్జున్ రెడ్డి కొత్త ట్రెండ్ కి తెరలేపింది

మరిన్ని వార్తలు

అర్జున్ రెడ్డి చిత్రం ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సంచలనమనే చెప్పాలి. ఈ సినిమాకి సంబందించిన టీజర్ విడుదల అయిన నాటి నుండి నిన్న రాత్రి ప్రివ్యూల వరకు ఈ సినిమా పై పాజిటివ్ టాక్ పెరుగుతూనే వుంది.

ఇక ప్రివ్యూలు అయిపోయిన తరువాత నుండి ఇది ఒక కొత్త ట్రెండ్ కి నాంది పలికే చిత్రంగా ఉంది అన్న టాక్ మొదలయింది. ఇప్పటివరకు స్టీరియో టైపు గా కొనసాగిన తెలుగు సినిమాని ఈ సినిమా మరోవైపుకి తిప్పుతుంది అన్న అభిప్రాయలు వినపడుతున్నాయి.

అయితే ఈ క్రెడిట్ లో ముఖ్య భాగం దర్శకుడు సందీప్ కి దక్కుతుంది అని ఆ తరువాత ప్రధాన తారాగణం అయిన విజయ్-శాలినిలకు వెళుతుంది అని అంటున్నారు. యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేసిన ఈ చిత్రం, వారి సహాయంతోనే అర్జున్ రెడ్డి బాక్స్ ఆఫీస్ వద్ద రూ 40కోట్లు పైగా వసూళ్ళు సంపాదించనుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మొత్తానికి అర్జున్ రెడ్డి ఈ తరం మెచ్చే చిత్రం అని... ఈతరానికి తగ్గటుగా తెలుగు చిత్రపరిశ్రమని మరొక వైపు తిప్పే సినిమాగా అర్జున్ రెడ్డి ఉంది అన్న మాట అన్ని వైపులా నుండి వినిపిస్తున్నది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS