3 గంటల నిడివితో విడుదలై కూడా ప్రేక్షకుల చేత సూపర్ హిట్ అనిపించుకున్న అర్జున్ రెడ్డి చిత్రానికి మరికొన్ని సీన్స్ జత చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం.
అయితే బయట వస్తున్న వార్తలు ప్రకారం ఈ చిత్రానికి 40నిమిషాలు కలపనున్నారు అని.. అయితే అందులో నిజం లేదట, కేవలం ఒక 15 నిమిషాలు మాత్రమే ఇప్పుడు ఉన్న చిత్రానికి జత కలపనున్నారని తెలిసింది. ఎందుకంటే, 40 నిమిషాలు కలిపితే, థియేటర్ల లో షో టైమింగ్స్ కి ఇబ్బందులు తలెత్తే నేపధ్యంలో కేవలం 15 నిమిషాల పెంపునకే మొగ్గు చూపుతునట్టు అర్జున్ రెడ్డి టీం చెపుతున్నది.
ఇక కలెక్షన్స్ పరంగా దూసుకుపోతున్న అర్జున్ రెడ్డి చిత్రానికి ఈ 15 నిమిషాల పెంపుతో కలెక్షన్స్ పరంగా ఏమన్నా ప్రభావం చూపుతుందో లేదో చూడాలి.