తీవ్ర విషాదంలో నటుడు బెనర్జీ

మరిన్ని వార్తలు

ప్రముఖ నటుడు బెనర్జీకి పితృవియోగం.

అందుతున్న సమాచారం ప్రకారం, రాఘవయ్య గారు (86) ఈరోజు ఉదయం హైదరాబాద్ ఫిలిం నగర్ లోని ఆయన కొడుకు బెనర్జీ నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలుసుకున్న నటీనటులు, శ్రేయోభిలాషులు బెనర్జీ ఇంటికి చేరుకొని ఆయన తండ్రి మృతికి తమ సంతాపం తెలియచేస్తున్నారు.

ఇక రాఘవయ్య కూడా పలు చిత్రాలలో నటుడిగా చేశారు. ఆయన తాజాగా మహేష్ బాబు చిత్రం భరత్ అనే నేను లో కూడా ఒక పాత్ర చేశారు, అదే ఈయన ఆఖరి చిత్రం. రాఘవయ్య అంత్యక్రియలు ఈరోజు ఫిలిం నగర్ మహాప్రస్థానంలో జరగనున్నాయి.

ఈ సందర్భంగా బెనర్జీ కుటుంబానికి మా www.iQlikmovies.com తరపున ప్రగాడ సానుభూతి తెలియచేస్తున్నాము.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS