'భాఘి 2' మైండ్‌ బ్లోయింగ్‌ ఫస్ట్‌లుక్‌

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్‌ కొడుకు టైగర్‌ ష్రాఫ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం 'భాఘి'. శ్రద్దాకపూర్‌ హీరోయిన్‌గా నటించింది ఈ సినిమాలో. యాక్షన్‌ సినిమాగా ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది. తెలుగులో ప్రబాస్‌, త్రిష జంటగా నటించిన 'వర్షం' సినిమాకి రీమేక్‌గా తెరకెక్కింది బాలీవుడ్‌లో ఈ సినిమా. ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్‌ రానుంది. అహ్మద్‌ ఖాన్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. 'బాఘి 2' టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ తాజాగా విడుదలైంది. తొలి పార్ట్‌లో కేరళ ప్రసిద్ది చెందిన కళరిపాయట్టు నేపథ్యంలో ఈ సినిమాలోని యాక్షన్‌ సీన్స్‌ని అద్భుతంగా తెరకెక్కించారు. ఆ యాక్షన్‌ సీన్స్‌ చాలా కొత్తగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. హీరో టైగర్‌ ష్రాప్‌ కండలు తీరిన బాడీతో యాక్షన్‌ సీన్స్‌కి కరెక్ట్‌ కటౌట్‌గా స్క్రీన్‌పై చెలరేగిపోయాడు ఆ సినిమాలో. ఇప్పుడు తాజాగా విడుదలైన ఫస్ట్‌లుక్‌ చూస్తుంటే ఈ సినిమా ఓ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. చేతిలో గన్‌తో ఓ సైనికుడి లా కనిపిస్తున్నాడు టైగర్‌ ష్రాప్‌ ఈ లుక్‌లో. కండలు తీరిన దేహంతో చేతిలో గన్‌ పట్టుకుని హీరో వెనక్కి తిరిగి ఉన్న ఈ ఫస్ట్‌లుక్‌ కి రెస్పాన్స్‌ అదరిపోతోంది. 2016లో విడుదలైన 'బాఘి'లో టైగర్‌ ష్రాఫ్‌తో పాటు హీరోయిన్‌ శ్రద్దాకపూర్‌ కూడా పోరాట సన్నివేశాల్లో చెలరేగిపోయింది. తెలుగు హీరో సుధీర్‌ బాబు విలన్‌ పాత్రలో నటించి మెప్పించాడు. విలన్‌గా సుధీర్‌ బాబుకి 'బాఘి' సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం రెండో పార్ట్‌ షూటింగ్‌ దశలో ఉంది. 2018 ఏప్రిల్‌ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS