ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న బాహుబలి 2 రిలీజ్ కేవలం 5 రోజులు మాత్రమే మిగిలివుంది.
ఇక ఈ నేపధ్యంలో టికెట్ ధర పెంచుతారు అని టాక్ నడుస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాహుబలి రిలీజ్ కి ఒక గొప్ప రిలీఫ్ ఇచ్చింది. విడుదల అయిన 28 ఏప్రిల్ నుండి పది రోజుల పాటు ఉదయం 7 గంటల నుండి తెల్లవారుజామున వరకు ఆరు షోలు వేసుకునే వీలు కలిపించారు.
అయితే టికెట్ ధర పెంపు పై మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. దీనితో బాహుబలి కి మొదటి రోజు కలెక్షన్స్ పరంగా రికార్డు సృష్టించే అవకాశాలు మేరుగుపడ్డాయి. ఇక ఇదే అంశం పై ఇటు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా బాహుబలి నిర్మాతలు కలిసే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఇవన్ని ఒకవైపు జరుగుతుంటే ఇంకొకవైపు బాహుబలి టీం తమ ప్రచార జారుని పెంచింది. ప్రచారానికి సంబంధించి దొరికిన ఏ చిన్న అవకాశం కూడా వదలట్లేదు.
ఇవన్ని చూస్తుంటే బాహుబలి డ్రీం టార్గెట్ రూ 1000 కోట్లు చేరుతుంది అనే ట్రేడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.