ఇప్పుడు ఎక్కడ చూసినా బాహుబలి మేనియానే కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో బాహుబలి 2 విడుదలకు తమిళనాడులో చిక్కులు ఏర్పడినాయి.
అందుతున్న సమాచారం ప్రకారం, శరవణన్ అనే డిస్ట్రిబ్యుటర్ తనకు రావాల్సిన బకాయిలు రాకుండా బాహుబలి 2 ని రిలీజ్ చేయవద్దని మద్రాసు హైకోర్టులో పిటీషన్ వేశాడు.
ఈ పిటీషన్ ని న్యాయస్థానం స్వీకరించడంతో ఒక్కసారిగా బాహుబలి రిలీజ్ పైన సందేహాలు జోరందుకున్నాయి. త్వరలోనే ఈ కేసు విచారణకు రానుంది.