బాహుబలి 2 విడుదలతో అంతర్జాతీయ స్థాయిలో మన తెలుగు చిత్రపరిశ్రమ పేరు మారుమోగిపోతున్న వేళ, ఒక కలెక్టర్ మాత్రం బాహుబలి 2 చేదు జ్ఞాపకంగా నిలిచింది.
వివరాల్లోకి వెళితే, వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి రిలీజ్ రోజున ప్రభుత్వ ఉద్యోగల కోసం 500 టికెట్లు కొనుగోలు చేయడం వివాదాస్పదమైన సంగతి విదితమే. దీనిపై ఒక వ్యక్తి కలెక్టర్ ఆమ్రపాలి పై గ్రీవియన్స్ సెల్ కు ఫిర్యాదు చేశారు.
అయితే కలెక్టర్ ఆమ్రపాలి మాత్రం తాను ఎటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని కేవలం తన క్రింద పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఆనందం నింపడానికే ఇలా చేసినట్టు తెలిపింది. ఇక టికెట్స్ కొన్నది కూడా ప్రభుత్వ సొమ్ముతో కాదని తెలిపింది.
ఇక ఇలా బల్క్ గా టికెట్స్ బుక్ చేసిన విషయం పై ప్రభుత్వ వర్గాల దృష్టి పడిందని, ఈ పూర్తి అంశం పై అంతర్గతంగా వివరాలు సేకరిస్తునట్టు వినికిడి.