కేవలం రెండంటే రెండే రోజుల్లో 'బాహుబలి ది కంక్లూజన్' సినిమా 200 కోట్లు దాటేసింది. ఓవర్సీస్‌లో రెండే రెండు రోజుల్లో అత్యధిక వసూళ్ళు సాధించి, అంతకు ముందు బాలీవుడ్ చిత్రాల పేరిట ఉన్న రికార్డుల్ని తుడిచిపెట్టేసింది 'బాహుబలి'. సినిమా విడుదలకి ముందే రికార్డులన్నీ 'ౖబాహుబలి' సొంతం అన్న పేరు సార్ధకం అయ్యింది. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ పండితుడు తరణ్ ఆదర్ష్ స్వయంగా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. గురువారం రాత్రి నుంచి లెక్కలు తీసుకుంటే, 'బాహుబలి' ఆదివారం ముగిసే సమయానికి 300 కోట్లకు దగ్గరలోకి వచ్చేసి ఉండొచ్చని అంచనా. తెలుగు సినిమా గర్వపడాల్సిన సినిమా ఇది. విదేశాల్లో తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటి చెప్పిన చిత్రమిది. ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది అందుకే ఈ సినిమా. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్క ఆర్టిస్టుకీ ఎంతో పేరు వచ్చింది. ప్రతీ టెక్నీషియన్ ఎంతో డెడికేటెడ్‌గా ఈ సినిమాకి కష్టపడి పని చేశారు. రాజమౌళి సృష్టించిన ఈ మహాద్భుతం ప్రపంచమంతా తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది. సినిమాకి చేసిన పబ్లిసిటీ ఏం తక్కువ కాదు.. అని సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ అనుకోకుండా ఉండలేకపోతున్నారు. అదే 'బాహుబలి' సినిమా గొప్పతనం. అందుకే రికార్డులు ఈ సినిమా సొంతం. ఏది ఏమైనా ఈ సినిమాకి ఈ రికార్డులు చాలవనిపిస్తోంది. ఈ హవా చూస్తుంటే, భవిష్యత్తులో మరిన్ని గొప్ప రికార్డులు 'బాహుబలి' సినిమాకి దక్కడం ఖాయమనిపిస్తోంది.