'దంగల్' చైనా వసూళ్ళు 888 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఇంకో 12 కోట్లు సాధిస్తే 900 కోట్ల క్లబ్‌లోకి చేరుతుంది. ఓవరాల్ వసూళ్ళలో 'బాహుబలి ది కంక్లూజన్'ని 'దంగల్' దాటేసి, అత్యధిక వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాగా రికార్డులకెక్కింది. ఓ ఇండియన్ సినిమా వేరే దేశంలో ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇంత రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించి కూడా ఇంకా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతూనే ఉంది 'దంగల్' అక్కడ. అయితే 'బాహుబలి ది కన్‌క్లూన్' ఇంకా చైనాలో రిలీజ్ కాలేదు. ఇంతవరకూ ఈ సినిమా సాధించిన వసూళ్లు 1500 కోట్లు కాగా, 'బాహుబలి ది కంక్లూజన్' చైనాలో విడుదలైతే ఈక్వేషన్స్ మారిపోతాయి. ఏది ఏమైనా ఇంతవరకూ పోటా పోటీగా సాగాయి ఈ రెండు సినిమాల వసూళ్లు. ఓ ఇండియన్ సినిమాగా 'బాహుబలి ది కన్‌క్లూజన్' ఓ సంచలనమైతే, ఆ సంచలనాన్ని మరో ఇండియన్ సినిమానే రికార్డు స్థాయిలో దాటించడం ఇండియన్ సినిమాకే గర్వ కారణం. చైనాలో 'బాహుబలి ది కన్‌క్లూజన్'ని విడుదల చేసేందుకు రాజమౌళి అండ్ టీమ్ సన్నాహాలు చేస్తోంది. చైనా ప్రేక్షకులు కూడా 'బాహుబలి ది కన్‌క్లూజన్' కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడి వారి కోసం ఈ సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేసి, మరింత అద్భుతంగా సినిమాని రూపొందించబోతున్నారట 'బాహుబలి టీమ్.