సమంత ఇన్నర్‌ బ్యూటీ అదే

మరిన్ని వార్తలు

ముద్దుగుమ్మ సమంత పుట్టినరోజు ఈ రోజు. 'ఏ మాయ చేశావె' సినిమాతో అచ్చ తెలుగు చీర కట్టులో నటించి నిజంగానే కుర్రకారును మాయ చేసేసింది. ఆ తర్వాత తెలుగు ప్రేక్షకుల్ని తన మాయలో మంత్ర ముగ్ధుల్ని చేసింది. అక్కినేని బుల్లోడు నాగ చైతన్యను లవ్‌లో ముంచేసి, అక్కినేని ఫ్యామిలీ అభిమానాన్ని పొందడమే కాకుండా, కోడలిగా త్వరలోనే ఆ ఇంట సందడి చేయనుంది. ఇటీవలే చైతూతో నిశ్చితార్ధం చేసుకుని త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది సమంత. ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా కొన్ని ముచ్చట్లు ఆమె మీడియాతో పంచుకుంది. '' సొసైటీ నాకెన్నో ఇచ్చింది. అందుకే అలాంటి సొసైటీ కోసం నేనేం ఇవ్వగలను అనుకున్నాను. నేనిప్పుడు ఇంత పెద్ద స్టార్‌నయ్యాను అంటే అదంతా సొసైటీ నాకిచ్చిన ప్రోత్సాహమే.. నావంతుగా సొసైటీకి ఎంతో కొంత సాయం చేయాలి అనుకున్నాను. అందుకే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాను. కానీ ఇదంతా పబ్లిసిటీ గురించి కాదు. సొసైటీ పట్ల తనకున్న కనీస బాధ్యత అపారమైన గౌరవమే '' అంటోంది ముద్దుగుమ్మ సమంత. ఇంకా ఆసక్తికర విషయమేమిటంటే, 100మంది అనాధ పిల్లలకి బాహుబలి 2 మొదటిరోజే అందరికి చూపించింది సమంతా. అంతేకాదు స్టార్‌ కావాలని చాలా మంది కలలు కంటారు. కానీ ఆ కలలు కొంత మందికే నిజం అవుతాయి. అలాంటి గొప్ప అవకాశం, అదృష్టం తనకి కలిగింది. అందుకే ఆ విషయం నేనెప్పటికీ గుర్తుంచుకుంటాను అంటోంది క్యూట్‌ బ్యూటీ సమంత. పలువురు సినీ ప్రముఖలు సోషల్‌ మీడియా ద్వారా సమంతకు బర్త్‌డే విషెస్‌ తెలిపారు. మనం కూడా సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేద్దామా మరి. 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS