బాలయ్య అభిమానుల అంచనాలను మించి

మరిన్ని వార్తలు

బాలయ్య - పూరీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాపై భారీగా అంచనాలున్న మాట వాస్తవమే. ఆ అంచనాలకు ఏ మాత్రం మించకుండా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట డేరింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌. బాలయ్య అంటే డైలాగులకు పెట్టింది పేరు. అందుకే అందుకు తగ్గట్లుగానే ప్రత్యేకంగా డైలాగులపై దృష్టి పెట్టారట పూరీ. బాలయ్యతో పూరీ చెప్పించే డైలాగులకు అభిమానులు పూనకమొచ్చినట్లు ఊగిపోతారట. అంత పవర్‌ ఫుల్‌గా ఉండబోతున్నాయంటున్నారు ఈ సినిమాలో డైలాగులు. మరో పక్క బాలయ్యని ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో సరికొత్త గెటప్‌లో చూపిస్తారట. ప్రస్తుతం పోర్చుగల్‌లో ఈ సినిమా భారీ షెడ్యూల్‌ జరుపుకుంటోంది. యాక్షన్‌ సీన్స్‌, సాంగ్స్‌, బాలయ్య గెటప్‌.. ఇలా ఈ సినిమాలో చాలా చాలా ప్రత్యేకతలు ఉండబోతున్నాయంటున్నారు పూరీ. బాలయ్య సరసన ముగ్గురు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు ఈ సినిమాలో. వారిలో శ్రియ ఓ హీరోయిన్‌ కాగా, శ్రియకు ఈ సినిమాలో కీలక పాత్ర ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమా అనౌన్స్‌మెంట్‌ రోజే రిలీజ్‌ డేట్‌ కూడా ప్రకటించారు పూరీ. అదే పూరీ గట్స్‌ అంటే. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా షూటింగ్‌ వేగవంతంగా జరుగుతోందట. అలాగే బాలయ్యతో షూటింగ్‌ చాలా కంఫర్టబుల్‌గా ఉందంటోంది చిత్ర యూనిట్‌. దాంతో సినిమా ఔట్‌ పుట్‌ అనుకున్న రేంజ్‌ కన్నా మించిన రేంజ్‌లోనే రావచ్చని పూరీ కాన్ఫిడెంట్‌గా ఉన్నారట. సెప్టెంబరులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS