పైసా వసూల్ చిత్రంతో తనలోని కొత్త కోణాన్ని పరిచయం చేసిన బాలకృష్ణ ఇప్పుడు తన 102వ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
ఇక ఇప్పటికే ఈ చిత్రం తాలుకా మొదటి షెడ్యూల్ ని పూర్తిచేసేశాడు. ఈ షెడ్యూల్ లో ఒక పాటతో పాటు 100 మంది ఫైటర్స్ తో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేసినట్టు తెలిసింది. బాలయ్య లోని ఒక కొత్త షేడ్ ని ఈ చిత్రంలో చూపెట్టనున్నట్టు దర్శకుడు కె ఎస్ రవి కుమర్ తెలిపారు.
ఈ చిత్రంలో బాలయ్య సరసన నయనతారతో పాటుగా మరొక కొత్త హీరోయిన్ నటించనున్నారు, వీరితో పాటే ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలో కనపడనున్నారు.
ఇదే స్పీడ్ తో గనుక షూటింగ్ చేస్తే త్వరలోనే ఈ చిత్రం విడుదల చేసే అవకాశాలు లేకపోలేదు అని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్.