బాల‌య్య - రావిపూడి... ముహూర్తం ఫిక్స్‌

మరిన్ని వార్తలు

నంద‌మూరి బాల‌కృష్ణ - అనిల్ రావిపూడి కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకోనున్న సంగ‌తి తెలిసిందే. అఖండ త‌ర‌వాత‌... గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ లో సినిమా మొద‌ల‌వుతుంది. ఈ సినిమా సెట్స్‌పై ఉండ‌గానే అనిల్ రావిపూడి సినిమాని ప‌ట్టాలెక్కించాల‌న్న‌ది బాల‌య్య ఆలోచ‌న‌. `ఎఫ్ 2` 2022 సంక్రాంతికి వ‌స్తుంది. జ‌న‌వ‌రి లోనే... బాల‌య్య సినిమాకి క్లాప్ కొట్టేస్తార‌ని టాక్‌. ప్ర‌స్తుతం ఎఫ్ 2 షూటింగ్ ఆగింది. ఈ గ్యాప్ లో బాల‌య్య క‌థ‌పై ఫోక‌స్ పెట్టాడు అనిల్ రావిపూడి.

 

రెండు నెలల్లో బాల‌య్య స్క్రిప్టు ప‌నుల్ని పూర్తి చేసేయాల‌ని అనిల్ రావిపూడి టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఆ వెంట‌నే ఎఫ్ 2 షూటింగ్ పూర్త‌వుతుంది. ఎఫ్ 2 విడుద‌ల కావ‌డం, బాల‌య్య సినిమా మొద‌ల‌వ్వ‌డం ఒకేసారి జ‌రుగుతాయి. 2022 వేస‌విలో బాల‌య్య - రావిపూడి సినిమా విడుద‌ల అవుతుంది. అఖండ ఈ ద‌స‌రాకి రావొచ్చ‌న్న సంకేతాలు వినిపిస్తున్నాయి. 2022 వేస‌విలో బాల‌య్య నుంచి రెండు సినిమాలు వ‌స్తాయి. ఒక‌టి గోపీచంద్ మ‌లినేని సినిమా అయితే, రెండోది అనిల్ రావిపూడిది. ఇవి రెండూ పూర్త‌య్యాకే బాల‌య్య - పూరి కాంబో సెట్స్‌పైకి వెళ్తుంద‌ని టాక్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS