నటసింహం బాలకృష్ణ మొన్ననే తన పుట్టినరోజుని అభిమానుల మధ్య కాకుండా పైసా వసూల్ చిత్రం షూటింగ్ లొకేషన్ లో జరుపుకున్నాడు.
అయితే ఈ సందర్భంగా బాలకృష్ణ భార్య వసుంధర, కూతుళ్ళు బ్రాహ్మిణి, తేజస్విని ఆయనను కలవడానికి పోర్చుగల్ వెళ్లారు. ఇక వారు తమ తండ్రికి అత్యంత ఖరీదైన బెంట్లీ కారుని పుట్టినరోజు బహుమతిగా ఇచ్చారు.
ఇక అక్కడే కుటుంబసభ్యులు మధ్య కేక్ కట్ చేసి తన పుట్టినరోజు జరుపుకున్నాడు. ఇలా బాలయ్య కూతుళ్ళు తమ తండ్రికి ప్రేమతో ఇంతటి ఖరీదైన బహుమతి ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.