బాలకృష్ణ స్వభావం తెలిసిన ఎవరైనా ఒక మాట మాత్రం కచ్చితంగా చెబుతారు. అదేంటంటే- ఆయనకీ ఎవరైనా నచ్చితే ఆ మనిషి గురించి ఎంతలా తాపత్రయ పడతారో అన్నది మాటల్లో చెప్పలేము’ అని.
ఇక దీనికి తాజా ఉదాహరణ- పూరి జగన్నాధ్ స్వీయ నిర్మాణంలో ఆయన కుమారుడు ఆకాష్ హీరోగా నటిస్తున్న మెహబూబా చిత్రం షూటింగ్ ఈ రోజే మొదలయింది. అయితే ఈ చిత్ర మొదటి షాట్ ని ఈ రోజు ఉదయం ఏ సమయానికి మొదలుపెట్టాలి అన్నదాని పైన బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధ చూపారట.
యూనిట్ వారికి ఉదయం నుండే ఫోన్ చేస్తూ సరిగ్గా ముహుర్తానికే మొదటి షాట్ తీసేలా ప్లాన్ చేశారట. ఈ విషయాన్ని స్వయంగా ఆకాష్ పూరి తన సోషల్ మీడియా ఎకౌంటు ద్వారా అందరితో పంచుకున్నాడు.
పైసా వసూల్ చిత్రం షూటింగ్ సమయంలో పూరి-బాలయ్యల మధ్య ఏర్పడిన స్నేహానికి ఇది ఒక్క మచ్చుతునక అని చెప్పొచ్చు.