బాలయ్య రొమాంటిక్ నెంబర్ ని వాడేస్తున్న కళ్యాణ్ రామ్

మరిన్ని వార్తలు

‘’ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా..’’ బాలకృష్ణ ధర్మక్షేతం చిత్రంలోని ఎవర్ గ్రీన్ మెలోడీ ఇది. ఇళయరాజా స్వరపరిచిన ఈ పాట ఇప్పటికీ వినిపిస్తూనే వుంటుంది. అయితే ఇప్పుడీ పాటని కళ్యాణ్ రామ్ రీమిక్స్ గా వినిపించబోతున్నాడు. కల్యాణ్‌రామ్‌ కొత్త చిత్రం ‘అమిగోస్‌’. రాజేంద్ర రెడ్డి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.

 

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇపుడీ సినిమాలో ఎన్నో రాత్రులు పాట రూపంలో మరో స్పెషల్ ఎట్రాక్షన్ చేరిపోయింది. బాబాయ్ సినిమాలోని పాటని అబ్బాయి కళ్యాణ్ రామ్ వాడుకోవడం అటు ఫ్యాన్స్ లో కూడా ఆసక్తిని రేపుతోంది.త్వరలోనే ఈ పాట పై అనౌన్స్ మెంట్ చేస్తారు. బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ నుండి వస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు వున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS