Balakrishna: బాలకృష్ణ సంక్రాంతి హెచ్చరిక

మరిన్ని వార్తలు

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేనిల మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'వీరసింహారెడ్డి'. బాలకృష్ణ మునుపెన్నడూ లేని మాస్ అవతార్‌లో కనిపిస్తున్న చిత్రమిది. టైటిల్, ఫస్ట్-లుక్ , ఫస్ట్ సింగిల్ జై బాలయ్యకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం విడుదల తేదిని మేకర్స్. 'వీరసింహారెడ్డి' జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

 

తన శత్రువులను హెచ్చరిస్తున్నట్లుగా రిలీజ్ డేట్ పోస్టర్ ని డిజైన్ చేశారు. ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. మొత్తానికి సంక్రాంతికి తొలి బెర్త్ ని ఖరారు చేసుకున్నారు బాలయ్య.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS