అమ్మ‌తోడు... అంటూ అబ‌ద్ధం చెప్పాడా?

మరిన్ని వార్తలు

డ్ర‌గ్స్ కేసులో మంగ‌ళ‌వారం ఈడీ ముందు హాజ‌ర‌య్యాడు పూరి. దాదాపు 10 గంట‌ల పాటు విచార‌ణ జ‌రిగింది. అదే స‌మ‌యంలో.. బండ్ల గ‌ణేష్ కూడా అక్క‌డ‌కు చేరుకున్నాడు. ఆ ప్లేసులో బండ్ల ని చూసి మీడియా షాకైంది. `ఈయ‌నేంటి ఇక్క‌డున్నారు` అనుకునే లోగా... `నేను పూరి కోసం వ‌చ్చాను. అమ్మ‌తోడు` అంటూ ఒట్టేసుకుని.. వెళ్లిపోయారు. నిజానికి ఈ విచార‌ణ‌లో భాగంగానే బండ్ల‌ని కూడా ఈడీ పిలిపించింద‌ని ఓ టాక్‌.

 

పూరితో బండ్ల గ‌ణేష్ రెండు సినిమాలు చేశాడు. పూరితో బండ్ల‌కు ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఉంది. ఇవ‌న్నీ దృష్టిలో ఉంచుకునే బండ్ల గ‌ణేష్ ని సైతం ఈడీ పిలిచించింద‌ని స‌మాచారం అందుతోంది. డ్ర‌గ్స్ అనేది చాలా తీవ్ర‌మైన కేసు. ఈ కేసులో ఎవ‌రెవ‌రికి ప్ర‌త్య‌క్ష్యంగానూ, ప‌రోక్షంగానూ సంబంధం ఉన్నా - ఏ ఒక్క‌రినీ ఈడీ వ‌ద‌ల‌దు. అందుకే బండ్ల‌ని సైతం... ఈడీ విచార‌ణ‌కు పిలిపించి ఉండొచ్చ‌ని ఓ టాక్ వినిపిస్తోంది. కాక‌పోతే నిజానిజాలు బ‌య‌ట‌కు రావాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS