బ్లేడు గ‌ణేష్ హ‌ర్ట‌య్యాడు

By iQlikMovies - January 23, 2020 - 11:30 AM IST

మరిన్ని వార్తలు

2019లో జ‌రిగిన ఎన్నిక‌ల‌కు ముందు `సెవ‌నో క్లాప్ బ్లేడు` తో గొంతుకోసుకుంటా అని చెప్పి బాగా పాపుల‌ర్ అయిపోయాడు బండ్ల గ‌ణేష్‌. అప్ప‌టి నుంచి తాను బ్లేడు గ‌ణేష్ అయిపోయాడు. ఆ ఎన్నిక‌ల‌లో త‌న మాట చెల్లుబాటు కాక‌పోవ‌డంతో రాజ‌కీయాల నుంచి శాశ్వ‌తంగా త‌ప్పుకోవాల్సివ‌చ్చింది. ఆ త‌ర‌వాత `స‌రిలేరు నీకెవ్వ‌రు` సినిమాతో మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలోని త‌న పాత్ర‌పై బండ్ల చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఈ సినిమాతో త‌న రీ ఎంట్రీ అదిరిపోయే స్థాయిలో ఉంటుంద‌ని ఊహించాడు. అయితే అవేం జ‌ర‌గ‌లేదు. బండ్ల పాత్ర ఈ సినిమాలో పేల‌లేదు. పైగా త‌న‌పై ఆరేడు స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తే.. అందులో ఒక‌టి మాత్ర‌మే వాడ‌డం త‌న‌కేమాత్రం న‌చ్చ‌లేద‌ట‌. దాంతో బండ్ల గ‌ణేష్ బాగా హ‌ర్ట‌య్యాడ‌ని తెలుస్తోంది.

 

ఈ విష‌య‌మై అనిల్ రావిపూడి ద‌గ్గ‌ర కూడా వాపోయాడ‌ట గ‌ణేష్‌. `త్వ‌ర‌లో కొన్ని సన్నివేశాలు క‌లుపుతున్నాం.. అందులో నీ సీన్ కూడా ఉంటుంది` అని బుజ్జ‌గించార‌ట‌. అయితే.. ఇప్పుడు స‌రిలేరు నీకెవ్వ‌రులో ఓ సీన్ క‌లిపారు. అది బండ్ల గ‌ణేష్‌ది కాదు. ఇక మీద‌ట ఈ సినిమాలో స‌న్నివేశాలు క‌లిపే అవ‌కాశం లేదు. దాంతో మ‌రోసారి గ‌ణేష్‌కి మొండి చేయి ఇచ్చిన‌ట్టైంది. ఈ సినిమా అన‌వ‌స‌రంగా చేశాన‌ని, నిర్మాత‌, ద‌ర్శ‌కులు బ‌ల‌వంతం చేసేస‌రికి కాద‌న‌లేక‌పోయాన‌ని, ఆ త‌ప్పు ఇంకెప్పుడూ చేయ‌కూడ‌ద‌ని స‌న్నిహితుల ద‌గ్గ‌ర వాపోతున్నాడ‌ట గ‌ణేష్.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS