ఈమధ్య బెల్లంకొండ శ్రీనివాస్ కి... రీమేక్‌లపై మనసు పడింది. `రాక్షసుడు`తో హిట్టు కొట్టాడు కదా. అది రీమేక్ సినిమానే. మరోవైపు `ఛత్రపతి` ని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఇప్పుడు... ధనుష్ సినిమాపై దృష్టి పడింది. ఇటీవల ధనుష్ `కర్ఱన్` విడుదలైంది. ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఇప్పుడీ చిత్రాన్ని బెల్లంకొండ తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడట.
ఇప్పటికే ఈ సినిమా హక్కుల్ని ఓ నిర్మాతతో కొనుగోలు చేయించాడని, తెలుగులో మార్చే ప్రయత్నాలు మొదలయ్యాయని తెలుస్తోంది. కాకపోతే... బెల్లంకొండకు ఓ దర్శకుడు కావాలి. ఈమధ్య హిట్టు కొట్టి, ప్రస్తుతానికి ఖాళీగా ఉన్న దర్శకుడ్ని వెదికేపనిలో పడ్డాడట బెల్లంకొండ. అన్నీకుదిరితే... త్వరలోనే ఓ అధికారిక ప్రకటన వచ్చేస్తుంది.
మరోవైపు.. `ఛత్రపతి` కి సంబంధించిన ఎలాంటి అప్ డేటూ బయటకు రావడం లేదు. కావాలని ఈ సినిమా విషయాల్ని గోప్యంగా ఉంచుతున్నారా? లేదంటే.. అసలు ఈ సినిమా అలికిడే లేదా? అనేది తెలియాల్సివుంది.